హరీశ్ రావు నీ రాజీనామా పత్రం ఎక్కడ..? జీవన్ రెడ్డి

-

హరీష్ రావు ని రాజీనామా పత్రం ఎక్కడ? అంటూ ఎమ్మల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పై కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రతిపక్ష నాయకులు గా ప్రభుత్వం చేసిన మంచి పనిని హర్షం వ్యక్తం చేయాలని తెలిపారు. భారతదేశ చరిత్రలో రైతు రుణమాఫీ సువర్ణ అక్షరాలతో లిఖింప దగ్గ కార్యక్రమం అన్నారు. రైతు బందుకు, రైతు రుణమాఫీకి సంబంధం లేదన్నారు. రైతుబంధు యదవిధిగా అమలవుతుందన్నారు. రైతు రుణమాఫీ ని జీర్ణించుకోలేక కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నాయకులువిమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం లేదన్నారు. పట్టాదారు పాస్ బుక్ కల్గిన ప్రతి రైతుకు ఋణ మాఫీ చేసి తీరుతామన్నారు. రైతు, రైతు కూలీ శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని క్లారిటీ ఇచ్చారు.

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రవు.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరించిన హరీశావు.. ‘సీఎం సవాల్ను స్వీకరిస్తున్నాను అన్నారు. ప్రతిపక్షంగా అధికార పక్షం ఇచ్చిన హామీలను నెరవేర్చడం మా బాధ్యత” అని అన్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తాను.. ఆగస్టు 15లోపు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ప్రమాణం చేశారు. ఆగస్టు 15లోపు పూర్తిగా రుణమాఫీ చేయాలి.. రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా? అని.. చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మరి జీవన్ రెడ్డి ప్రశ్నలకు హరీష్ రావును అందరూ ట్రోల్ కి గుర్తిచేస్తున్నారు. రాజీనామా ప్రతంతో సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. పేజీలు పేజీలు రాజీనామా ప్రతాలతో వస్తే సరిపోదన్నారు. రెండు లైన్లతో రాజీనామా ప్రతం ఉంటే చాలని హరీష్ రావును కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచిస్తున్నారు. మరిదీనిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశావు ఎలా స్పందిస్తారు. ఆయన చెప్పినట్లుగానే రాజీనామా చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.

Read more RELATED
Recommended to you

Latest news