పల్నాడు వైసీపీ నేత హత్య.. వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

పల్నాడు వైసీపీ నేత హత్యపై కాంగ్రెస్‌ ఏపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల స్పందించారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం అన్నారు. ప్రతి ఒక్కరూ గొంతెత్తి ఖండించాల్సిన చర్య అంటూ ఫైర్‌ అయ్యారు. ఇంకెంత క్షీణించాలి శాంతిభద్రతలు రాష్ట్రంలో! అంటూ ట్వీట్‌ చేశారు షర్మిల. నడిరోడ్డు మీద ఆటవికంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏమి చేస్తున్నట్టు అని మండి పడ్డారు.

ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్తుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఇది రాజకీయ హత్య అయితే, కూటమి సర్కారుకు ఇదే హెచ్చరిక అంటూ ఫైర్ అయ్యారు వైఎస్‌ షర్మిల. ఇటువంటి ఘటనలు ఆదిలోనే ఆపకపోతే ఇది మీకు, రాష్ట్రానికి మంచిది కాదన్నారు. నాగరిక సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు తావు లేదు. అటు చంద్రబాబు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి మా డిమాండ్ ఇదే. వీటికి అడ్డుకట్ట వేస్తారా లేదా? రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని వార్నింగ్‌ ఇచ్చారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news