పాన్ కార్డ్ పర్మినెంట్ అక్కౌంట్ నంబర్ కార్డ్. దీనిని భారత పౌరులకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దేశంలోని ప్రజలందరికీ పాన్ కార్డు అనేది ఖచ్చితంగా అత్యవసరం. అయితే ఒక్కోసారి మనం ఈ కార్డును పొరపాటున ఎక్కడైనా పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే కార్డు లేకపోతే మన లావాదేవీలకు తీవ్ర అంతరాయం అనేది కలుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా డూప్లికేట్ పాన్ కార్డును పొందే అవకాశం కూడా ఉంది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డూప్లికేట్ పాన్ కార్డు పొందాలంటే.. మనం డూప్లికేట్ పాన్ కార్డును ఆన్ లైన్ లో చాలా సులభంగా పొందవచ్చు. దాని కోసం ఇప్పుడు చెప్పే పద్ధతులు పాటించి, దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా మీరు పాన్ కార్డ్ కి సంబంధించిన https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html వెబ్ సైట్ లోకి వెళ్లండి. తరువాత అప్లికేషన్ టైప్ అనే దానిని ఎంపిక చేసుకుని, పాన్ కార్డు రీప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక అక్కడ తెరుచుకున్న పేజీలో మీ పాన్ నంబర్, ఆధార్ ఇంకా పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి. తరువాత ఇమెయిల్, మొబైల్ ద్వారా ఓటీపీ డెలివరీ ఎంపికను ఎంచుకోమని అడుగుతారు. ఇక మీ ప్రాధాన్య ఎంపికను ఎంచుకున్న తర్వాత, మీ ఒరిజినల్ పాన్ కార్డ్‌తో అనుబంధించబడిన మీ ఇమెయిల్, మొబైల్ నంబర్‌కు ఓటీపీ అనేది వస్తుంది. ఇక ఆ ఓటీపీని పేజీలో నమోదు చేసి, సెండ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. దానికి అవసరమైన చార్జీని ఆన్‌లైన్‌లోనే చెల్లించి, ప్రింట్ ద పాన్ కార్డ్ అనే ఎంపికపై మీరు క్లిక్ చేయాలి. తరువాత మీ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. దానిలో తెలిపిన లింక్‌ని ఉపయోగించి ఇ-పాన్‌ను కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇక మీ ఒరిజినల్ కార్డులోని వివరాలే డూప్లికేట్ కార్డులో కూడా ఉంటాయి. అయితే కొత్తగా ఏ సమాచారం, వివరాలు అప్ డేట్ కావు. ఇక డూప్లికేట్ పాన్ కార్డ్ 15 నుంచి 20 రోజుల సమయంలో మీ చిరునామాకు వస్తుంది.డూప్లికేట్ పాన్ కార్డు మన ఇంటికి రావడానికి దాదాపు 15 నుంచి 20 రోజులు పడుతుంది కాబట్టి మీకు అత్యవసరం అయితే ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందుకు పాన్ కార్డ్ ముందుగా వెబ్ సైట్ ను సందర్శించాలి. తరువాత మీపేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ తదితర వివరాలు దానిలో నమోదు చేయాలి.ఆ తరువాత దరఖాస్తు ఫాంను సమర్పించండి. అప్పుడు మీకు ఇమెయిల్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్ లో ఇ-పాన్‌ను పంపిస్తారు.దాన్ని మీ ఇమెయిల్ నుంచి చాలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.