వీధి ఆవుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎం చేస్తుందో తెలుసా…?

-

దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులు పవిత్రంగా భావించే ఆవుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆవులను పెంచడానికి ప్రత్యేకంగా ఆర్ధిక సాయం కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆవుల కోసం చలి కోటులు కూడా కుట్టించడానికి కాంట్రాక్టులు పిలిచిన సంగతి విదితమే.

రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే, ప్రభుత్వాలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. హిందుత్వ ఓటు బ్యాంకుని కాపాడుకోవడానికి గాను బిజెపి ఈ విధమైన చర్యలకు దిగుతుందని విపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆవుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏకంగా అడవులనే పెంచాలని ఆ రాష్ట్రంలో బిజెపి సర్కార్ నిర్ణయించింది.

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో కొత్తగా ఆవుల అభయారణ్యాలను ఏర్పాటు చేసేందుకు, ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ బడ్జెట్ కూడా కేటాయించింది. వీధుల్లో తిరుగుతున్న ఆవులకు రక్షణగా, ఆవులకు సహజసిద్దమైన అటవీ వాతావరణం కల్పించడంతో పాటు వాటికి ఆహారంగా ప్రత్యేక౦గా పశు గ్రాసం కూడా పెంచాలని, నీళ్ళ కోసం చెరువులను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో గోశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికోసం కాళీగా ఉన్న భూములను అన్వేషిస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news