అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌కు అన్నివైపుల నుంచి మద్దతు దక్కుతోంది. ఈ తరుణంలో ఆమె తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాకు సేవ చేసే అర్హత ఆమెకు లేదని, ఆమెకు పాలించడం చేతకాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ట్రంప్ ను దీటుగా ఎదుర్కొనేందుకు కమలా రెడీ అవుతున్నారు. ఆయనతో డిబేట్ కు తాను రెడీ అని తాజాగా ఆమె తెలిపారు.
అయితే డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ కు షాక్ ఇచ్చారు. తాను ఇప్పుడే డిబేట్ లో పాల్గొనని.. కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని డెమోక్రాటిక్ పార్టీ అధికారికంగా నిర్ణయించే వరకు వేచిచూస్తానని తెలిపారు. అధికారిక ప్రకటన తర్వాతే తాను ఆమెతో డిబేట్ లో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఆ పార్టీలో గందరగోళం సాగుతున్న తరుణంలో వారు అధికారికంగా తమ అధ్యక్ష అభ్యర్థిని ప్రకటించేవరకు డిబేట్ గురించి మాట్లాడలేనని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.