రాష్ట్రంలో ప్రతిపేదవాడికి ఇల్లు కట్టిస్తాం : భ‌ట్టి

-

రాష్ట్రంలో ప్రతిపేదవాడికి ఇల్లు కట్టిస్తాం అని శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏమి చేప్పింది?? ఏమి చేసిందో అందరికీ తెలుసు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు.. చేశారా?.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా ?.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా ?  అని వరుస ప్రశ్నలు సంధించారు.

మీరు మాకు ఆరు గ్యారంటీలకు గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ ప్రాంగణానికి పిలిపించి ఇక్కడే పథకం మొదలు పెట్టాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ప్రతి గ్యారంటీనీ అమలు చేసేందుకు తపిస్తున్న ప్రభుత్వం మాది. ప్రభుత్వంలోని ప్రతి మంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకూ వారివారి కార్యలయాల్లో సమీక్షలు నిర్వహిస్తూ.. పనిచేస్తున్నారు. మీలాగా సెక్రటేరియట్ మెహం చూడని నాయకత్వంలా మేము లేము అని పేర్కొన్నారు. అలాగే గ్యాస్ సిలండర్ ను రూ. 500కే అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని భ‌ట్టి విక్ర‌మార్క‌ స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news