YCP లీడర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్..!

-

YCP లీడర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసారు. మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అయిన మోహిత్ రెడ్డి పై ఎన్నికల తర్వాత పులివర్తి నానిపై దాడి చేసాడు అనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలన సమయంలో నానిపై మోహిత్ రెడ్డి దాడి సేసాడనే అభియోగాలతో మోహిత్ రెడ్డిపై హత్యా యత్నం కేసు నమోదయ్యింది. ఇందులో భాగంగానే మోహిత్ రెడ్డిని ఈరోజు తిరుపతి పోలీసులు బెంగుళూర్ లో అదుపులోకి తీసుకొని.. మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఇది ఇలా ఉంటె ఎన్నికల్లో మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుండి YCP అభ్యర్ధికగా పోటీ చేసారు. కానీ ఫలితాల రోజు వచ్చిన కూటమి సునామిలో కొట్టుపోయారు. అయితే ఇప్పుడు అరెస్ట్ తో మళ్ళీ మోహిత్ రెడ్డి వార్తల్లోకి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news