అక్కడ భర్తలకు భార్యలు పాకెట్‌మనీ ఇస్తారట.. ఎక్కడో తెలుసా?

-

ఉద్యోగం పురుష లక్షణం అని అనాదిగా మన పెద్దలు చెబుతూ వస్తున్న మాట. అందుకే చాలా వరకు భారతీయ ఇళ్లలో పురుషుడు ఉద్యోగమో, వ్యాపారమో చేస్తే మహిళ ఇంటిని చక్కదిద్దుతూ కుటుంబ సంరక్షణ చూసుకుంటుంది. అయితే నేటి సమాజంలో మహిళలు, పురుషులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో సమానంగా సంపాదిస్తూ కలిసి సంసార నావను లాగుతున్నారు. ఎంత స్త్రీలు ఉద్యోగం చేస్తున్నా చాలా కుటుంబాల్లో ఇప్పటికీ ఆర్థిక పరమైన అంశాల్లో భర్తదే పెద్దనం. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఆడవాళ్లదే పెత్తనం ఉంటుందనుకోండి.

అయితే జపాన్లో మాత్రం కాస్త డిఫరెంట్ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ‘కొజుకై’ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ సంప్రదాయం ప్రకారం భర్తలు సంపాదించే మొత్తం డబ్బును భార్యల చేతిలో పెడితే ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, సేవింగ్స్‌ అన్నీ పోగా.. మిగిలిన డబ్బులో నుంచి భర్తలకు నెలనెలా భార్యలే పాకెట్‌మనీ ఇస్తుంటారు. జపాన్‌లో 74 శాతం మంది మహిళలు ఇంటిపనులు చూసుకొంటూ డబ్బు ఆదా చేస్తున్నారని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.. ఈ విధంగా భార్యలకు డబ్బు ఇవ్వడం వల్ల వైవాహిక బంధంలో వారి మధ్య నమ్మకం, పారదర్శకత పెరుగుతాయని, తమ వృథా ఖర్చులు అరికట్టొచ్చని జపాన్‌ భర్తలు అంటున్నారు. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందే..!!

Read more RELATED
Recommended to you

Latest news