ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దికేరకు చెందిన ఓ వ్యక్తి గుర్రపుస్వారీ చేస్తూ కింద పడి మరణించాడు. అయితే అతడు సరదా కోసం గుర్రపు స్వారీ చేశాడా లేక సోషల్ మీడియాలో రీల్ కోసం ట్రై చేస్తూ పడిపోయాడా అనేది తెలియదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యువకుడి గుర్రపు స్వారీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది అంటే..?
కర్నూలు జిల్లా మద్దిరేకరు చెందిన పృథ్వీరాజ్ రాయుడు (28)కి గుర్రపుస్వారీ అంటే చాలా ఇష్టం. తాజాగా ఆయన బీఎన్పేట నుంచి గుర్రపుస్వారీ చేస్తూ వస్తున్నాడు. గుర్రం చాలా స్పీడ్గా వెళ్తోంది. పక్కనే ఓ వాహనంపై పృథ్వీ స్నేహితుడు ఇదంతా వీడియో రికార్డ్ చేస్తూ అతణ్ని అనుసరిస్తున్నాడు. అయితే మార్గమధ్యలో పృథ్వీ ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు. గుర్రం అతివేగంగా వెళ్లడంతో పృథ్వీ కింద పడిపోయాడు. ఈ ఘటనలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. పృథ్వీకి భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు.
గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు(28) బీఎన్ పేట నుంచి గుర్రంపై వస్తున్నాడు. మార్గమధ్యలో ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ… pic.twitter.com/LCi5d7TQsR
— ChotaNews (@ChotaNewsTelugu) July 28, 2024