పారిస్‌ ఒలింపిక్స్‌లో లక్ష్యసేన్‌ ‘విజయం రద్దు’

-

పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌ గ్రూప్‌ స్టేజ్‌లో లక్ష్యసేన్ (21-8, 22-20) విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విజయాన్ని రద్దు చేసినట్లు సమాచారం. ప్రత్యర్థి ఆటగాడు గాయపడటమే ఇందుక్కారణం. అసలేం జరిగిదంటే..?

బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ఎల్‌లో భాగంగా లక్ష్య సేన్‌ గత శనివారం తన తొలి మ్యాచ్‌లో గ్వాటెమాలా ఆటగాడు కెవిన్‌ కార్డన్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో తొలి నుంచి ఆధిపత్యం సాగిస్తూ వరుస సెట్లలో 21-8, 22-20తో లక్ష్య విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌ తర్వాత కెవిన్‌ ఎడమ మోచేతి గాయం కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ కాంపిటిషన్‌ నిబంధనల ప్రకారం.. గ్రూప్‌ దశలో ఇలా ఎవరైనా గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తే వాళ్లు ఆడిన లేదా ఆడాల్సిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకోరు. ఆ రిజల్ట్స్ను టోర్నీ నుంచి తొలగిస్తారు. ఈ క్రమంలోనే లక్ష్య సేన్‌ తొలి విజయాన్ని ఒలింపిక్స్‌ నిర్వాహకులు రికార్డుల నుంచి తొలగించారు. లక్ష్యసేన్ తన తర్వాతి రెండు మ్యాచుల్లో సోమవారం జులియన్‌ కరాగీతో బుధవారం క్రిస్టితో తలపడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news