ఛాలెంజ్ యాక్సెప్టెడ్.. ఆరోపణలు ప్రూవ్ చేయలేకపోతే రాజీనామాకు రెడీ : కోమటిరెడ్డి

-

విద్యుత్ కొనుగోళ్ల అంశంపై శాసనసభలో వాడివేడి చర్చ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిల మధ్య వర్డ్ వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు విసురుకుంటున్నారు. జగదీశ్ రెడ్డి హత్య కేసుల్లో నిందుతుడని, దొంగతనం కేసులోనూ నిందితుడిగా ఉన్నాడని.. ఏడాది పాటు ఆయణ్ను జిల్లా నుంచి బహిష్కరించారని, మద్యం కేసులోనూ నిందితుడంటూ కోమటిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

తనపై మంత్రి చేసినవన్నీ నిరాధార, అసత్య ఆరోపణలన్నీ జగదీశ్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాల్లో నుంచి వైదొలగాలని సవాల్ విసిరారు. జగదీశ్ రెడ్డి సవాల్ స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తానని స్పష్టం చేశారు. తాను చేసిన ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news