Real Estate : హైదరాబాద్లోని ఆ ప్రాంతాలకు డిమాండ్ మాములుగా లేదు..!

-

Real Estate : హైదరాబాద్ లోని ఔటర్, రీజనల్ రింగ్ రోడ్ల మధ్య ఓ ఇండస్ట్రియల్ సిటీని నిర్మించాలని అధికారులు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాలకు డిమాండ్ అనేది ఓ రేంజ్ లో ఉంది.ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో కంపెనీలు కట్టించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచాలని ప్లాన్ చేస్తుంది. అక్కడ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటైతే మామూలు అభివృద్ధి జరగదు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఔటర్, రీజనల్ రింగ్ రోడ్ల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఒక రేంజ్ లో పెరుగుతాయి.

హైదరాబాద్‌ లో ఎన్నో లక్షల మంది జనాలు బ్రతుకుతున్నారు. పక్క రాష్ట్రాల వారే కాకుండా విదేశీయులు కూడా హైదరాబాద్ వచ్చి బ్రతుకుతున్నారంటే దీనికి కారణం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటమే. చుట్టూ అన్ని రకాల పరిశ్రమలు ఎంతో మందికి అన్నం పెడుతున్నాయి. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ సహా ఎన్నో రంగాలు హైదరాబాద్ లో నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంలో ఏకంగా 25వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ సిటీ ఏర్పాటు చెయ్యాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

కాలుష్యరహిత సిటీగా హైదరాబాద్‌ని మార్చడానికి మరిన్నిపెట్టుబడులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అనేక రకాల జాగ్రత్తలతో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇలాంటి క్లస్టర్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు బాగా విస్తరించడం వల్ల రియల్ ఎస్టేట్ అవకాశాలు మెండుగా అవుతాయి. అందువల్ల ఇప్పుడే వాటికి దగ్గరలో ఉండే ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో కోట్లలో లాభాలు పొందవచ్చు.

ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌ జోరుగా సాగుతోంది. ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం రేడియల్‌ రోడ్ల కనెక్టివిటీతో బాగా డెవలప్ చెందనుంది.కాబట్టి కచ్చితంగా అక్కడ ఉద్యోగులకు, కార్మికులకు సరిపడా ఇళ్ల నిర్మాణం అనేది అవసరం అవుతుంది. దీంతో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో మరిన్ని నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపట్టడంపై పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పటికే తమ ప్లాన్స్ రెడి చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news