రుణ మాఫీ చేయనందుకే BRS ఓడిపోయింది..!

-

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక కామెంట్స్ చేసాడు. రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే BRS ప్రతిపక్షంలో కూర్చొంది అని అన్నారు. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరం అని తెలిపారు. గతంలో సీఎం చెప్పిన లెక్కల ప్రకారం రుణ మాఫీకి అర్హులు అయిన 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. కానీ ఇప్పుడు అందులో కోత విధించినట్లు లెక్కలు చూస్తుంటే తెలుస్తోంది.

అయితే ఏ ప్రాతిపాదికన రుణ మాఫీ కోసం రైతులను ఎంపిక చేసారు అని ప్రశ్నించిన ఆయన.. వరంగల్ సభలో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని ఒప్పుకున్నారు. కాబట్టి మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలి అని అన్నారు.అలాగే ఈ ఏడాది రైతు బంధు పడలేదు. కాబట్టి సీజన్ రైతు బంధు విడుదల చేయాలి అని డిమాండ్ చేసిన మహేశ్వర రెడ్డి.. రైతు బంధుకు , రైతు భరోసా కు వేర్వేరు నిధులు కేటాయించాలి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news