ఇరాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య

-

గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌తో పోరాటం చేస్తున్న హమాస్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ సంస్థ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా (62) హత్యకు గురయ్యాడు. ఇరాన్‌లో ఆయన హత్యకు గురవ్వగా.. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ టీవీ ఈరోజు ప్రకటించింది. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ను ఉటంకిస్తూ ఈ కథనం టెలికాస్ట్ చేసింది.

మరోవైపు హమాస్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇది ఇజ్రాయెల్‌ దాడిగా అభివర్ణించింది. టెహ్రాన్‌లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియా, ఆయన బాడీగార్డ్‌ మృతి చెందినట్లు హమాస్ తెలిపింది. ఆయన ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన తర్వాత దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది.

ఇంకోవైపు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూనే ఉంది. ఇటీవల ఓ పాఠశాలతో పాటు ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో సుమారు 30మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news