నేడే తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ .. శాసనసభ వేదికగా విడుదల

-

తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపింది. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయనుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు శాసనసభలో జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తారు. జాబ్‌ క్యాలెండర్‌కు చట్టబద్ధత తీసుకురానున్నారు.

‘‘మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ఏటా నిర్దిష్ట  కాలవ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరోవైపు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు సంబంధించి.. ఆర్డినెన్స్‌ తీసుకొచ్చైనా వాటిలోనూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మేరకు ఎస్సీ,ఎస్టీ ఉపవర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రేవంత్ గురువారం రోజున అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.  జాబ్‌ క్యాలెండర్‌లో ఒకసారి షెడ్యూల్‌ ప్రకటించి చట్ట ప్రకారం ఉద్యోగ నియామకాలు పూర్తి చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యోగ ఎంపిక పరీక్షలు వరుసగా ఉంటాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news