BREAKING: కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..ప్రమాదంలో 1600 మంది యాత్రికులు!

-

Kedarnath Yatra will be temporarily suspended: కేదార్‌నాథ్ యాత్రికులకు బిగ్‌ షాక్‌. కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. కేదార్‌ నాథ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతు అయ్యాయి. కేదార్‌నాథ్‌లో 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు.

8 Gallanthu Kedarnath Yatra will be temporarily suspended

భారీ వర్షాలకు కొండ చరియలు..విరిగిప డుతున్నాయి. ఈ తరునంలోనే.. కేదార్‌ నాథ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడి 18 మంది గల్లంతు అయ్యాయి. అటు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు..రంగంలోకి దిగాయి.

ఇక అటు గౌరీకుండ్‌-కేదార్‌నాథ్‌ దారి లో చిక్కుకుపోయారు భక్తులు.. ఇప్పటి వరకు 3 వేల మందిని రక్షించింది రెస్క్యూ టీమ్స్‌. గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో గాలిస్తున్నాయి సహాయక బృందాలు.. హరిద్వార్‌, తెహ్రీ, డెహ్రాడూన్‌, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు చోటు చేసుకున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news