బీసీజీ రిపోర్ట్‌: 13 జిల్లాలను 6 ప్రాంతాలుగా విభజించిన బోస్టన్ కమిటీ

-

ఏపీ సీఎం జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తమ నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, అమరావతి ప్రాంత వ్యూహాలను ఈ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో అన్ని ప్రదేశాలు తిరిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా గుర్తించి.. అక్కడ ఏం వస్తే అభివృద్థి చెందుతుందో సవివరంగా వివరించారు. 13 జిల్లాల ఏపీని ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ ప్రాంతాలుగా గుర్తించాలని సూచించిందని గ్రూప్ సభ్యుడు విజయ్‌కుమార్‌ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నివేదిక వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.2లక్షల కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు. అప్పుల వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇబ్బందిగా ఉందని వివరించారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు. వ్యవసాయం విషయంలోనూ చాలా అసమతుల్యత ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉందని తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్‌ కనెక్టివిటీ ఉందన్నారు. అలాగే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప.గో., కడప, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తి తక్కువ ఉన్నట్లు వివరించారు. ఇలా పరిస్థితులను బీసీజీ బేరీజు వేసిందని వివరించారు. మూడు ప్రాంతాల్లోనూ విశాఖ, విజయవాడ, కర్నూలును ప్రధానంగా భావించి దృష్టి సారించాలని బీసీజీ సూచించిందని పేర్కొన్నారు. ‘సీఎం క్యాంప్‌ ఆఫీసు సహా ఏడు కీలక విభాగాలు విశాఖలో ఉండొచ్చు.

 

హైకోర్టు బెంచ్‌, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ విశాఖలో ఉండొచ్చు. కర్నూలులో హైకోర్టు, అప్పిలేట్‌ అథారిటీలు ఉండాలని బీసీజీ సూచించింది. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌ ఉండాలని సూచించింది. అలాగే పరిపాలన సౌలభ్యం కోసం కార్యనిర్వాహక విధుల్లో మొత్తం 8 విభాగం వుండాలని బీసీజీ సూచించింది. లెజిస్లేచర్‌, జుడీషియరీ మినహాయిస్తే మిగతా ఆరు విభాగాలుంటాయి. ఈ ఆరు విభాగాల్లో నేరుగా ప్రజలకు సంబంధం ఉన్న శాఖలు కొన్ని, హోం, రెవెన్యూ లంటి శాఖలకు మిగతా శాఖలకు సంబంధం ఉన్నంటు వంటివి ఒక చోట. మిగతావి మరో చోట పెట్టాలని సూచించారు. ఎడ్యుకేషన్‌ లాంటి విషయాల్లో విజయవాడకు ఫస్ట్‌, విశాఖకు రెండో.

టూరిజం విశాఖకు ప్రథమ, విజయవాడకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని’ సూచించిందని చెప్పారు. అలాగే ‘ఒక నగరంపై రూ.లక్షకోట్లు ఖర్చుపెడితే.. 40 ఏళ్లలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం అంత ఖర్చు భరించే స్థితిలో ఏపీ లేదు. ఏపీకి ఉన్న పరిమిత వనరులు అమరావతిపై కేంద్రీకరిస్తే సాధించేది ఏమీ ఉండదు. అభివృద్ధి వికేంద్రీకరిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అమరావతికి ఖర్చుపెట్టాల్సిన లక్ష కోట్లు ఇరిగేషన్‌ మీద ఖర్చు పెడితే.. ఐదేళ్లలో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అంటే ఏ రకంగా చూసినా అమరావతి కట్టడం కన్నా… అభివృద్ధి వికేంద్రీకరించడమే మేలు అని బీసీజీ చెప్పింది. అమరావతిలో రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం రిస్క్‌ అని… దీర్ఘకాలంలో నష్టదాయమని బీసీజీ చెప్పింది.’ అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news