వైరల్ వీడియో ఒక్క పరుగు తీయడానికి ఎన్ని బంతులు తీసుకున్నాడో తెలుసా…? అభినందించిన బౌలర్…!

-

శుక్రవారం న్యూజిలాండ్ ఆసిస్ జట్ల మధ్య మూడో టెస్ట్ మొదలయింది. పటిష్ట ఆసిస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్ని వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసిస్ జట్టుకి కివీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీనితో ఆసిస్ బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి తీవ్రంగానే ఇబ్బంది పడ్డారు. 95 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఆసిస్ జట్టుని సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్,

యువ ఆటగాడు లాబుస్చాగ్నే మరియు స్మిత్ కలిసి మూడో వికెట్కు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్టీవ్ స్మిత్ పరుగులు చేయడానికి తీవ్రంగానే ఇబ్బంది పడ్డాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ 39 బంతులు, 43 నిమిషాలు ఆడి గాని పరుగుల ఖాతా తెరవలేదు. దీనితో మైదానంలో అభిమానులు అతన్ని చప్పట్లతో పెద్ద ఎత్తున అభినందించారు.

38 డాట్ బంతులను ఎదుర్కొన్న తరువాత, స్టీవ్ స్మిత్ వాగ్నెర్ డెలివరీని స్క్వేర్ లెగ్‌కు ఆడి సింగల్ తీయగా వాగ్నేర్ అతన్ని అభినందిస్తూ ఉంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆసిస్ జట్టు మూడో టెస్ట్ లో కూడా గెలిచి వైట్ వాష్ చెయ్యాలని భావిస్తుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసిస్ జట్టు మూడు వికెట్లకు 283 పరుగులు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news