భద్రత కోసం నాకు ఇచ్చిన కారు శిథిలావస్థలో ఉంది..!

-

ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కీలక అంశాలు తెలిపారు. భద్రత కోసం నాకు కేటాయించిన కారు శిథిలావస్థలో ఉంది. 2018 నాటి బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ కారు. విండ్ షీల్డ్ మొత్తం పగిలిపోయి ఎదురు వైపు నుంచి దాడులకు గురయ్యే అవకాశం ఉంది. కారు వెనుక డోర్ ఓపెన్ కాదు. ఇటీవల పర్యటనలో కారులో ఎయిర్ కండిషన్ పని చేయటం ఆగిపోయింది. దీంతో ప్రోగ్రామ్ మధ్యలో ఆపాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.

నా వ్యక్తిగత బుల్లెట్ ప్రూఫ్ కారులో రాష్ట్రమంతా పర్యటించి ప్రజలను, పార్టీ క్యాడర్ ను కలిసేందును ప్రయత్నించాను. కానీ పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. వారు ఇచ్చిన కారు మాత్రమే వాడాలని పోలీసులు పట్టుబట్టారు. నా ప్రొటెక్షన్ కోసం పోలీసులు ఇచ్చిన కారు ప్రయాణానికి పనికి రాకుండా ఉండటంతో నేను ఇంటికి పరిమితం చేయాలని ఇచ్చినట్టు అనిపిస్తోంది అని జగన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news