రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం రోజున వెల్లడించారు. ఇందులో భాగంగా రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి ఇది ఇలాగే కొనసాగుతోంది. రెపోరేటులో మార్పు లేకపోవడం ఇది తొమ్మిదోసారి.
ఇక పరపతి విధాన కమిటీలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇవే..
ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ఏప్రిల్ – మేలో స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం జూన్లో మళ్లీ పెరిగింది.
అప్పులు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విస్తరణ అసమతుల్యంగా ఉంది.
భారత సేవా రంగ కార్యకలాపాలు బలంగా ఉన్నాయి.
బ్యాంకు రుణాల విస్తరణ నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడులు జోరందుకున్నాయి.
2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 7.2 శాతం.
నైరుతి రుతుపవనాల వల్ల ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశం
2024-25లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా.
భారత కరెన్సీ రూపాయి మారకం విలువ పరిమిత శ్రేణిలోనే కదులుతోంది.