Success Story : చిన్న వయస్సులోనే డిప్యూటీ కలెక్టరయ్యి ఆదర్శంగా నిలుస్తున్న తెలుగమ్మాయి?

-

భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష..  ప్రస్తుతం అందరికీ  ఆదర్శంగా నిలుస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించి ఇప్పుడు ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది.ఇంకా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్‌లో 198వ ర్యాంక్ సాధించి.. ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికయ్యింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ల మండలానికి చెందిన ప్రత్యూష తండ్రి పేరు వెంకట రామాంజనేయులు, తల్లి పేరు ఉషా. వెంకట రామాంజనేయులు ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.ప్రత్యూష వీరికి ఏకైక కూతురు. ఈమె మొదట నుంచి చదువుపై ఉన్న ఆసక్తితోనే నేడు ఉన్నత శిఖరాలను అందుకొని తండ్రి పేరు నిలబెట్టింది.ప్రత్యూష పాఠశాల చదువు అంతా పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరిగింది.ఇంటర్ తెలంగాణలోని హైదరాబాద్‌లో శ్రీచైతన్య కాలేజీలో చదివింది.టెన్త్‌ క్లాస్ లో ఏకంగా 10 కి 10 పాయింట్లు సాధించింది ప్రత్యూష. అలాగే ఇంటర్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచింది.ఇంటర్ మొదటి సంవత్సరంలో 492 మార్కులు సాధించింది.ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్‌ తీసుకుంది.

ఇంటర్ లో స్టేట్ ఫస్ట్.. గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్.. నాన్న కల  నెరవేర్చిన ప్రత్యూష సక్సెస్ స్టోరీ ఇదే

బిఎ ఎకనామిక్స్ కోసం ఢిల్లీ యూనివర్సిటీలో చదివింది. ఇంకా ఈమె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్‌లో అఖండ విజయం సాధించి ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికయ్యింది.ఇక ప్రత్యూష ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో ఆగస్టు 26వ తేదీ నుంచి ముస్సోరీలో జరగనున్న శిక్షణకు హాజరు కావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన గ్రూప్‌-1 పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది ప్రత్యూష. ఆ తరువాత ఇప్పుడు ఏలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ట్రైనింగ్‌లో ఉంది. ఒక తెలగమ్మాయి ఇంత తక్కువ సమయంలో సివిల్స్‌లో అఖండ విజయం సాధించి రికార్డ్  క్రియేట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఇంతటి ఘనత సాధించిన తెలుగుమ్మాయి భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news