జనసేనలో మొదలైన అసంతృప్తి.. జనసేనాన్ని రంగంలోకి దిగుతారా..?

-

కూటమి ప్రభుత్వంలో పాలు నీళ్లుగా కలిసిపోయిన టిడిపి, జనసేన, బిజెపి నేతలు ఐక్యత రాగం ఆలపిస్తున్నారు.. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు జనసేన బిజెపి లకు ప్రాధాన్యత ఇచ్చారు.. మంత్రి పదవుల కట్టబెట్టారు.. ఇంతవరకు బాగానే ఉన్నా.. మరో 10 రోజుల్లో నామినేటెడ్ పదవుల పందారం జరగబోతున్న క్రమంలో.. జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో నడుస్తుంది.. భాగస్వామి పార్టీలుగా ఉన్న జనసేన బిజెపి లకు నామినేటెడ్ పోస్టుల్లో 20 శాతం మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టిడిపిలో చర్చ నడుస్తోంది.. ఈ చర్చ పట్ల జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నారట..

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సూపర్ హిట్ కొట్టింది.. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మంచి మెజార్టీతో గెలుపొందారు.. జనసేన వల్లే తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిందనే భావన ఆ పార్టీలో ఉంది.. దానికి తోడు బిజెపి కూడా జతకట్టడంతో మూడు పార్టీలు భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల్లో తమ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన నుంచి డిమాండు వినిపిస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేసిన దామాషాలోని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తూ ఉన్నారని.. అది సరైన పద్ధతి కాదని వాదన జనసేన నేతల నుంచి వస్తోంది.. జనసేనకు మొదటినుంచి అండగా ఉన్న నేతలకు చివరి నిమిషంలో టికెట్లు రాలేదు.. వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.. వారితోపాటు గత పదిహేనుగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీతో ఉన్న యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.. ఈ డిమాండ్ సైతం అధినేత దృష్టికి వెళ్లిందనే ప్రచారం జరుగుతుంది..

కార్యకర్తలు నేతల రెక్కల కష్టంతో పార్టీని బలోపేతం చేసుకున్నామని చెప్పే పవన్ కళ్యాణ్.. కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవించి.. నామినేటెడ్ పదవుల్లో అధిక శాతాన్ని చేజిక్కించుకునేలా ప్రయత్నాలు చేయాలని జనసేనాని క్యాడర్ కోరుతోంది.. దీనిపై డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news