UPI కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సులభంగా, అసలు ఎలాంటి ఖర్చు అనేది లేకుండా, నడి రోడ్డుపై ఎక్కడైనా కానీ మన నగదు ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే UPI అనే చెప్పాలి. ఇది వచ్చాక సాధారణ ప్రజలకు చాలా భారం తగ్గింది. వారి ఆర్ధిక లావాదేవీలు చాలా సులభం అయ్యాయి.
ఇక ఈ సేవలను మరింత ఈజీ చేసేందుకు, UPI వినియోగదారుల అనుభవాన్ని ఇంకా పెరుగుపరిచేందుకు RBI, NPCIలు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఇక సెక్యూరిటీ ఫీచర్స్ లో భాగంగా పిన్‌కు బదులు బయోమెట్రిక్స్ ఆప్షన్ అందించాలని ఇటీవల ప్లాన్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా UPI కస్టమర్లకు RBI గవర్నర్ మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.అయితే UPI కి కూడా ఓ లిమిటేషన్ ఉంది.అదేంటంటే రోజుకు కేవలం లక్ష మాత్రమే ఈ విధానం ద్వారా మనం ఇతరులకు బదిలీ చేయవచ్చు.
అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ జరపాలంటే NEFT లేదా RTGS వంటి ఎక్కువ సమయం పట్టే మార్గాలను ఎంచుకోక తప్పదు. అందువల్ల యూజర్స్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.అయితే ఈ ఇబ్బందిని గమనించిన RBI ప్రస్తుతం ఉన్న 1 లక్ష లిమిట్ ను ఏకంగా 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీని గురించి RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది.
ప్రస్తుతం UPI యూజర్ బేస్ అనేది 424 మిలియన్లు కాగా తాజా నిర్ణయంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని శక్తికాంతదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 5 లక్షలకు లిమిట్ పెంపుతో పాటు ఓ వ్యక్తికి బదిలీ చేసే నగదుపై ఎవరికి వారు స్వయంగా లిమిట్ పెట్టుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలపడం జరిగింది. ఇది అతి త్వరలో దేశ ప్రజలకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు.