ట్రెడిషనల్ పీకాక్ కర్రీపై వీడియో.. యూట్యూబర్ అరెస్టు!

-

సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం నేటి తరం ఇన్ఫ్లుయెన్సర్లు చిత్రవిచిత్రాలు చేస్తున్నారు. కొందరు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు వివాదాల్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. తాజాగా ఓ యూట్యూబర్కు తాను చేసిన వంటకం, ఆ వంటకానికి పెట్టిన థంబ్నెయిలు తంటా తెచ్చి పెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన కోడం ప్రణయ్ అనే యూట్యూబర్ చికెన్ కర్రీ వండి నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలో చూడడంటూ వంటకాన్ని సిద్ధం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అంతే కాదు దానికి థంబ్నెయిల్గా తాను నెమలిని పట్టుకున్నట్లు గ్రాఫిక్స్ చేసి పెట్టాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవ్వడంతో దెబ్బకు డిలీట్ చేశాడు. కానీ అంతలోనే ఈ విషయం కాస్త అటవీశాఖ అధికారులకు తెలిసింది. వాళ్లు ప్రణయ్ ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కోడి ఈకలు, చికెన్ కర్రీని సీజ్ చేశారు. వాటిని ల్యాబ్ కు పంపించిన అధికారులు.. నెమలి వంటకమని తేలితే అతనిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news