దాడులను నిరసిస్తూ.. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల ఆందోళన

-

బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత కూడా అక్కడ అల్లర్లు తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా ఆమె రాజీనా చేసిన తర్వాత అక్కడి మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తమపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్‌లలో లక్షల మంది హిందువులు, బుద్ధిస్ట్లు, క్రిస్టియన్లు భారీగా నిరసనకు దిగారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరికి వేల సంఖ్యలో ముస్లిం ప్రదర్శనకారులు కూడా సంఘీభావం తెలిపారు. చిట్టగాంగ్‌లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు ఏడు లక్షల మంది పాల్గొన్నట్లు సమాచారం.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బంగ్లాదేేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ స్పందిస్తూ.. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఉద్దేశంతో పనిచేసే మీడియా సంస్థల్ని మూసివేయక తప్పదని హెచ్చరించింది. నిజాయతీని మీడియా కాపాడకపోతే ఏ దేశమైనా పతనమవుతుందని ఆ దేశ హోంశాఖ సలహాదారుడు సఖావత్‌ హుస్సేన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news