ఇక నుంచి రైళ్లలోనూ ఉచిత వైఫై!

-

వైఫై.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచతమైన పేరు ఇది. తిండి తినకుండా రెండు రోజులు ఉండమన్నా ఉంటారు కానీ.. ఫోన్‌లో నెట్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి నేటి యువతది. యువతే కాదులే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు గిగా బైట్ల డేటాను కూడా ఐస్ లెక్క కరిగించేస్తున్నారు.

అందుకే ప్రయాణికులను ఆకర్షించడానికి భారతీయ రైల్వే ఇదివరకే 400 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫైను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇంకాస్త ముందడుగేసి రైళ్లలోనూ ఫ్రీ వైఫైని ఇవ్వడానికి సమాయత్తమవుతున్నది. కాకపోతే పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ట్రెయిన్లలో ముందుగా ఫ్రీ వైఫైని ప్రవేశపెట్టనుంది. రాజధాని శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైళ్లలో వైఫై హాట్ స్పాట్‌ను తీసుకురానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అది సక్సెస్ అయిన తర్వాత అన్ని రైళ్లలో ఈ సదుపాయాన్ని తీసుకురానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అన్ని రైళ్లలో గనుక ఫ్రీ వైఫై వచ్చేస్తే ట్రెయిన్ ప్రయాణం చాలా ఈజీగా గడిచిపోతుంది. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్‌తోనే తమ సమయాన్ని ప్రయాణికులు గడుపుతారు. దీంతో ట్రెయిన్‌లో ప్రయాణించినట్టు కూడా అనిపించదు. బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లే వాళ్లు కూడా ఫ్రీ వైఫై వల్ల రైళ్లలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతారని వాళ్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news