ఎలక్షన్స్ ప్రచారంలో ఎన్టీఆర్..!

-

ఈ టైటిల్ చూసి కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ అంతా ఎక్సైట్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న నందమూరి ఫ్యామిలీలో ఏ హీరో ఎప్పుడు ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటాడో ఎవరికి తెలియదు. అప్పటికి 2009 లో ఎన్.టి.ఆర్ టిడిపి తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక మరోసారి ఎన్.టి.ఆర్ ప్రచార పర్వంలో పాల్గొంటున్నాడు. అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పొలిటికల్ కాంపెయిన్ కు సంబందించిన సీన్స్ ఉన్నాయట. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు.

ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news