హైదరాబాద్ లో సీజనల్ వ్యాధుల టెన్షన్..!

-

హైదరాబాద్ లో వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ఈ సీజనల్ వ్యాధులతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రిలతో పాటు పలు ఏరియా ఆసుపత్రులు కూడా పేషెంట్లతో నిండిపోతున్నాయి. పెషెంట్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా నగర వ్యాప్తంగా దోమలు విపరీతంగా పెరిగాయి. దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధుల కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతుండటం విశేషం. 

ముఖ్యంగా తెలంగాణను వైరల్ ఫీవర్ గజ గజ వణికిస్తోంది. చాలా జిల్లాలలో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చేరుతున్నారు. ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. దీంతో జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఇంటి పరిసరాల పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ వైరల్ ఫీవర్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news