రేవంత్ సర్కార్ పై తెలంగాణ ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధం అయ్యారు. టీఎన్జీవో అధ్యక్షుడు జగదీశ్వర్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 15 సంఘాలతో ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని.. పది సంవత్సరాలుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరం కాలేదన్నారు. గత ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉద్యోగులను ఎక్కడెక్కడో విసిరేసిందని… సీపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకు వస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిందన్నారు.
ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని… ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించలేదని ఆగ్రహించారు. చెప్పిన విధంగా సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బందులు పెడుతుందని… భాగ్యనగర్ ఉద్యోగుల సంఘం భూమిని ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం అమెరికా పర్యటన తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి పాత ప్రాంతాలకు బదిలీ చేయాలని… త్వరలో జేఏసీ కార్యాచరణ ప్రకటించి… మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు.