విజయవాడ బాబాయ్ హోటల్‌లో విక్రమ్ బ్రేక్‌ఫాస్ట్..!

-

విజయవాడ నగరంలో సందడి చేశాడు హీరో చియాన్ విక్రమ్. తంగలాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నగరంలోని బాబాయ్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 తంగలాన్ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఐదు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.  ఒక కొత్త క్యారెక్టర్ లో ఈ చిత్రంలో ప్రేక్షకులకు కనిపిస్తాను.  దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశారు.

చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ,నాన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. తంగలాన్ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను. తంగలాన్ ఒక ఎమోషనల్ మూవీ. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. హీరోయిన్ మాళవిక మోహనన్ ఒక కొత్త క్యారెక్టర్ లో కనిపిస్తారు. మాళవిక ఫైట్స్ చేయడం కోసం కొన్ని రోజుల తరబడి ప్రాక్టీస్ చేసింది. లండన్ నుంచి వచ్చిన డేనియల్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తారు. డేనియల్ నటన అద్భుతంగా ఉంది. ప్రతి సన్నివేశాన్ని సింగిల్ షాట్ లో చేసాం. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి ప్రాణం పోశారు. పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. తంగలాన్ చిత్రంలో నా క్యారెక్టర్, హెయిర్, డ్రెస్సింగ్ విలక్షణంగా ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news