బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా రూపంలో భారత్ కి మరో ప్రమాదం పొంచి ఉందా..

-

భారత్ కి పొరుగు దేశంగా ఉన్న బంగ్లాదేశ్ కు మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా భారత్ లో తలదాచుకుంటుంది. ఆమెపై దేశంలో పెల్లుబికిన నిరసనలతో ఆమె సోదరీ రెహానా తో కలిసి ఉన్నఫలంగా భారత్ కు వచ్చేశారు.. అయితే ఆమె తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్తారనే కథనాలు వస్తున్నప్పటికీ.. అక్కడికి వెళితే ఆమెను జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయని బంగ్లా పరిస్థితులు బట్టి అర్థమవుతుంది.. ఈ క్రమంలో ఆమె భారత్ లోనే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది..

hina khan

హసీనా లాగే టిబెటన్ల ఆధ్యాత్మిక గురువుగా ఉన్న దలైలామా 1959లో భారత్ లోకి వచ్చేసారు. ఏప్రిల్ 18న అస్సాంలోని తేజ్ పూర్ కి వచ్చిన అయన.. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకొని ఇతర దేశాల పర్యటనలు సైతం భారత్ నుంచే చేసారు.. దలైలామాను తమకు అప్పగించాలంటూ చైనా భారత్ పై అప్పట్లో యుద్ధానికి కూడా దిగింది.. కానీ భారత్ మాత్రం దలైలామాను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించలేదు.. తమ దేశానికి వచ్చిన అతిథులను తిరిగి పంపించబోమని భారత్ స్పష్టం చేసింది.. దీని ఆగ్రహించిన చైనా యుద్ధానికి దిగి అక్సాయ్ చిన్ లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంది.. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది..

ఈ క్రమంలోనే భారత్ కి పొరుగు దేశంగా ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా కూడా భారత్ లోనే తల దాచుకుంటూ ఉండటంతో.. భారతీయుల్లో ఓ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దలైలామా కోసం భారత్ పై చైనా యుద్ధం చేసినట్టుగానే.. బంగ్లాదేశ్ నుంచి కూడా ప్రమాదం పొంచి ఉందనే ప్రచారం జరుగుతోంది. హసీనా భారత్కు రావడం ఇది రెండోసారి.. 1975లో కూడా కొన్నాళ్ళు ఆమె భారత్ లో తలదాచుకుంది.. కానీ ఈసారి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.. పొరుగు దేశాల నుంచి కి వచ్చే అతిథుల సంక్షేమం కోసం భారత్ సాహసమే చేస్తుందన్న మాట .

Read more RELATED
Recommended to you

Latest news