మహిళలకు గుడ్ న్యూస్.. మహిళా సంఘాలకు రూ.2లక్షల రుణబీమా

-

మహిళా సంఘాలకు రూ. 2 లక్షల రుణబీమా, రూ.10 లక్షల ప్రమాద బీమా ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది అని మంత్రి సీతక్క తెలిపారు. తాజాగా 11వ స్త్రీ నిధి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శ్రీనిధి వల్ల రైతులు టీ వ్యాపారుల నుంచి విముక్తుల్లయ్యారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగు పడుతుంది అన్నారు. మహిళల ఆర్థిక ప్రగతి ఆ సమాజ ప్రగతి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పారు.

మా ప్రజా ప్రభుత్వం తూచ తప్పకుండా అంబేద్కర్ ఆలోచనలను ఆచరిస్తుంది. తనలో బ్యాంకులకు వెళ్లాలంటేనే మహిళలు భయపడేవారు. బ్యాంకులకు వెళ్లిన మహిళలను చిన్నచూపు చేసేవారు. వాటిని అధిగమించి నెలలు ఆర్థికంగా బలపతమయ్యారు. మహిళా సంఘాల నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. ప్రవేటు వద్దు ప్రభుత్వమే ముద్దు.. మైక్రో ఫైనాన్స్ సంస్థలు వద్దు.. స్త్రీ నిధి ముద్దు అనే నినాదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మహిళల ఆర్థిక ప్రగతి కోసం హామీలను అమలు చేస్తున్నారు. 500 కి గ్యాసు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం మహిళల కోసం అమలు చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణాన్ని అవహేళన చేస్తూ వీడియోలు రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహిళా సాధికారతను తట్టుకోలేక ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news