కాకతీయ యూనివర్సిటీ లో విద్యార్థుల ఆందోళన..!

-

వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలో మెస్ నిర్వహణ సరిగా లేదంటూ రోడ్డెక్కారు విద్యార్థులు. ప్లేట్లు పట్టుకొని ఫస్ట్ గేటు ముందు ధర్నా చేసారు విద్యార్థులు. తమకు సరిపడా భోజనాలు పెట్టడం లేదంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థులు.

అయితే తెలంగాణలో ఏంథి గుర్తింపు ఉన్న కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో క్వాలిటీ లేని మెస్ పెడుతున్నారంటూ నిరసనకు దిగారు విద్యార్థులు. కామన్ మెస్ లో సరైన భోజనం పెట్టకపోవడంతో రోజు సగం మంది పస్తులు ఉండాల్సి వస్తుందంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థులు. నాన్ బోర్డర్లు మెస్ లో భోజనం చేయడంతో అసలైన విద్యార్థులకు భోజనం అందడం లేదంటున్నారు మెస్ సిబ్బంది, నిర్వాహకులు. అయితే కాకతీయ యూనివర్సిటీలో నిరసన చేస్తున్న విద్యార్థులతో చర్చలు జరుపుతున్నారు రిజిస్టార్ మల్లారెడ్డి. అయితే తమకు రోజు సరిపడా.. నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఈ విషయంలో నిర్వాహకులు తమకు మాట ఇచ్చేవరకు తన ధర్నా ఆగదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news