వలస పక్షుల్లో వారికి మాత్రమే టీడీపీలోకి ఎంట్రీ.. చంద్రబాబు కీలక నిర్ణయం..

-

ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ చుట్టూ తిరగడం.. వారు కరుణిస్తే పార్టీ పంచన చేరడం కొందరు నేతలకు అలవాటుగా ఉంటుంది.. రాజకీయ అవసరాలు తీర్చుకునేందుకు పార్టీలు మారుతూ ఉంటారు.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో చేరి.. తమ రాజకీయ అవసరాలు తీర్చుకున్న కొందరు. తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. అలాంటి వారి పట్ల సీఎం చంద్రబాబునాయుడు అప్రమత్తంగా ఉన్నారట.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారం కోసం గోడలు దూకిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవద్దనే డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

2014 నుంచి 2019 మధ్యలో అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారంతా తిరిగి పార్టీలోకి వస్తామని రాయబారాలు పంపుతున్నా.. టీడీపీ నుంచి స్పందన కరువైందట.. పార్టీలో చేరిక వ్యవహారాన్ని మంత్రి నారాలోకేష్ ప్రత్యేకంగా డీల్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. పార్టీపై విమర్శలు చేసినవారిని.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వారిని అస్సలు పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెబుతున్నారట.. ఒక వేళ పార్టీలోకి తీసుకోవాల్సి వస్తే.. క్లీన్ చిట్ ఉండేవారిని మాత్రమే తీసుకుంటామనే లోకేష్ పార్టీ నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది..

కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రాంతాలకు చెందిన నేతలు ఇప్పటికే నారాలోకేష్ ను కలిశారట.. కానీ పార్టీలో చేర్చుకునేందుకు ఆయన ఆసక్తి చూపలేదనే ప్రచారం టీడీపీలో నడుస్తోంది. ప్రజాబలం, వాక్చాతుర్యం కల్గిన యువతకు ప్రాధాన్యత ఇస్తే.. పార్టీకి అండగా ఉంటారని.. అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద ప్రపోజల్ పెట్టారట.. ఈ చేరికల వ్యవహారంపై పొలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని చంద్రబాబు కూడా పార్టీ నేతల వద్ద ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది.. నామినెటెడ్ పోస్టుల భర్తీ తర్వాత చేరికలపై ఓ క్లారిటీకి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news