ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇవాళ మరో 99 అన్న క్యాంటీన్ల ప్రారంభం

-

ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇవాళ మరో 99 అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ…. అన్న క్యాంటీన్ల ప్రారంభ పండుగకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 7.30 గంటల నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు ప్రజా ప్రతినిధులు.అన్న క్యాంటీన్లు ప్రారంభ ఉత్సవానికి పక్కగా ఏర్పాట్లు చేయాలని… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు మంత్రి నారాయణ.

Today is the start of another 99 canteens

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైం లో అంటే 7.30 నిమిషాలకు రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని… ఆయా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాల్లోని మంత్రులు, ఎమ్మెల్యే లు,ఎంపీలు తో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు మంత్రి నారాయణ. క్యాంటీన్లకు వచ్చే లబ్ధిదారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది పూర్తిగా పరిశీలించాలని కోరారు మంత్రి నారాయణ..

Read more RELATED
Recommended to you

Latest news