మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి. ఫ్రీ బస్సులు పెట్టింది ఉల్లిపాయాలు, ఎల్లిపాయాలు వోలుచుకోవాటానికా, రికార్దింగ్ డాన్సు లు వెయ్యటానికా అంటూ మహిళల పట్ల కేటిఆర్ వ్యంగ్యంగా మాట్లాడం సరికాదు అని తెలిపిన ఆయన.. మహిళలను కించపరిచేలా మాట్లాడంతో కేటిఆర్ సంస్కారం ఏంటో తెలిస్తుంది.
BRS ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ప్రాదన్యత ఇవ్వలేదు. మహిళల కష్టాసుఖాలు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రీ బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. కేటిఆర్ కి కేసిఆర్ కు మహిళల పట్ల ఎంత సంస్కారం ఉందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆడపడుచులు అంటే అంత అలుసా మీకు…? ఉన్న సమయాన్ని వృదా చేయ్యకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలను ఆగౌరవ పరచటమే మీ పనా అని మండిపడ్డారు. పొట్ట కూటి కోసం చేసుకుంటున్న వృత్తులను కూడా అవమానపరుస్తురా… మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా…?వాళ్ళని కూడా ఇలానే ఆగౌరవ పరిస్తే మీరు ఉరుకుంటారా అని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు.