కన్నప్ప నుంచి కంపడు క్యారెక్టర్ రివీల్.. అంచనాలను పెంచుతున్న పోస్టర్

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాను ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కుస్తుండగా.. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్యకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే కన్నప్ప సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు, దేవరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నాడు. అయితే కన్నప్ప డిసెంబర్లో పాన్ ఇండియన్ చిత్రంగా వరల్డ్ వైడ్గా విడుదల కాబోతుంది.

ఈ తరుణంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన మధుబాల పన్నగ, దేవరాజ్ ముండడు, సంపత్ రామ్ చుండడు, వంటి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా, కన్నప్ప మేకర్స్ రాఖీ పండుగ కావడంతో ముఖేష్ రిషి కంపడు పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమా పై భారీ అంచనాలు పెంచేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news