గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ: ఏపీకి 5 బిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడులు

-

పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు , గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌ ఎవ్రెన్ ముందుకొచ్చింది.బ్రూక్‌ఫీల్డ్ , యాక్సిస్ యాజమాన్య బృందం ఏపీ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడుతో పాటు గౌరవ ఇంధన శాఖా మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్ , 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

5 billion US dollars investment for AP

వీటిలో 3000 మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిందని, 2026 చివరి నాటికి ఆ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని తెలిపారు . పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ప్రణాళికలే కాకుండా, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, ఈ -మొబిలిటీ, గ్రీన్ అమ్మోనియా వంటి వాటిలో రాష్ట్రంలో అదనపు అవకాశాలను ఎవ్రెన్ అన్వేషిస్తోందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనువైన విధానాలను అమలుచేస్తోందని , పెట్టుబడిదారులకు, ప్రజలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సమయానుకూల అనుమతులతో పాటు పారదర్శకతను ప్రోత్సహించేందుకు , రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు.

ఇంధన రంగం లో పెట్టుబడులను సాకారం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నూతన అవకాశాలకు, ఉద్యోగ కల్పనకు , స్థిరమైన అభివృద్ధి సాదించేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయన్నారు. సౌర, పవన ఇంధన వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఏపీ లో ఆకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు . సోలార్ పార్కులు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్‌లు, పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news