తుంగతుర్తిలో ఉద్రిక్తత..గాదరి కిషోర్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు !

-

సూర్యపేట జిల్లా తుంగతుర్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గాదరి కిషోర్‌పై దాడి చేశారట కాంగ్రెస్ నేతలు. రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తున్న గాదరి కిషోర్‌పై కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని చేపట్టిన రైతు నిరసన దీక్షపై దాడి చేశారట కాంగ్రెస్ నేతలు.

Congress leaders attacked Gadari Kishore who was protesting for loan waiver

ఈ సందర్భంగా రాళ్లతో, కోడి గుడ్లతో దాడి చేసినట్లు సమాచారం. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయట. ఇంతలోనే రంగంలోకి దిగిన పోలీసులు…. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మాట్లాడుతూ…. అక్రమ కేసులతో రైతులను వేధిస్తున్నారన్నారు. రైతుల రుణం మాఫీ చేయకుండా రైతులతో రణం చేస్తున్నారని రేవంత్‌ పై మండిపడ్డారు. చివరి రైతుకు రుణ మాఫీ జరిగేంతవరకు రైతులకు అండగా ఉంటాం… పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news