అచ్యుతాపురం ఘటన చాలా బాధాకరమని…. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే.. దీనిపై బొత్స స్పందించారు. కోటి రూపాయలు చెక్కులు అందించాలని.. అదే సమయంలో…బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భాదితుల డిమాండ్ సహేతుకమైందని… బాబు ప్రభుత్వం పై అపనమ్మకంతో బాధుతులు ఉన్నారన్నారు.
ప్రభుత్వం భరొసా ఇవ్వక పోవడంతోనే మృతుల కుటుంబాలు ఆందోళన చేస్తున్నారని ఆగ్రహించారు. రేపు వైసిపి అధినేత జగన్ భాదితులను పరామర్శిస్తారని… ఇది రాజకియం కాదు , విమర్శలు చెయటం లేదని తెలిపారు. సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కో0టి రూపాయల చెక్కులు ఇచ్చి డెడ్ బాడీలను ఇక్కడ నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ జి పాలిమర్స్ ఇష్యులో కాంపెన్ సేషన్ ఇచ్చామ న్నారు. డబ్బు తో పోయిన ప్రాణాలు కొనలేమని… కానీ మానవత్వం తో ఉపసమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు బొత్స.