EVMలు ట్యాంపర్‌.. ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలి..!

-

EVMలు ట్యాంపర్‌ అయ్యాయని.. ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. ఏపీలో జరిగిన ఎన్నికలు అవినీతిమయమన్నారు. ఈవీఎంలు టాంపర్ అయ్యాయని ఆరోపణలు చేశారు. 1800 బూత్ లలో మా ఓట్లు ఎలా మిస్సయ్యాయో ఆధారాలతో చెప్పానని… మా ఫ్యామిలీ నుంచి 25 ఓట్లు వేస్తే…రెండే చూపించారని ఫైర్‌ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయినట్లేనని తెలిపారు.

ఏపీలో మళ్లీ ఎన్నికలు జరిపించాలన్నారు. శ్రీ భరత్ పేరు వైజాగ్ లో ఎవరికీ తెలియదని చురకలు అంటించారు. చంద్రబాబు కొడుకు తోడల్లుడు , బాలకృష్ణ అల్లుడు అని చెబితే కానీ తెలియదని విమర్శలు చేశారు. 55200 చర్చిలు, 5 లక్షల ఓట్లు బీజేపీ మద్దతిచ్చిన భరత్ కు ఎలా పడ్డాయి…మీడియా ధైర్యంగా రిపోర్ట్ చేయండని కోరారు. మీకు ఎవరైనా లైసెన్సులు ఆపేస్తే …నేను తిరిగి ఇప్పిస్తానన్నారు. చంద్రబాబును అమెరికా రమ్మని నేను కోరా..అక్టోబర్ 2న సమ్మిట్ పెడదామని చెప్పానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news