నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత వెనుక చంద్రబాబు కుట్రలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేసింది హైడ్రా. కన్వెన్షన్ సెంటర్లోని రెండు హాళ్లు పూర్తిగా నేలమట్టం అయింది. కొన్ని గంటల్లోనే కన్వెన్షన్న్ సెంటర్లోని హాళ్ళను కూల్చివేసింది సిబ్బంది. అత్యధిక మిషనరీతో కన్వెన్షన్ సెంటర్ కి ఇవాళ ఉదయమే చేరుకున్న అధికారులు… ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేశారు.
అయితే… తెలుగుదేశం పార్టీ హయాంలోనే అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్‌సెంటర్ కూల్చేయడానికి కుట్ర జరిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూల్చేవేశారని చెబుతున్నారు. చంద్రబాబుకు శిష్యుడే రేవంత్ కాబట్టి… ఆయన మాట విని… నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేతకు ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మురళీమోహన్ అక్రమ కట్టడాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడలేదా? అని కూడా కొందరు అంటున్నారు.