నిర్మల్ జిల్లాలో ‘HP’ గ్యాస్ తూకంలో అవకతవకలు..!

-

నిర్మల్ జిల్లాలో HP గ్యాస్ తూకంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ లో 3 నుంచి 4 కిలోల గ్యాస్ తక్కువగా రావడం తో అధికారులకు పిర్యాదు చేశారు. దస్తురబాద్ కు వచ్చిన గ్యాస్ సిలిండర్ ల వాహనం లో వచ్చిన 40 కి పైగా సిలిండర్ లలో తక్కువ గా గ్యాస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వినియోగదారులను మోసం చేస్తున్నది హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ. ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న HP  ఏజెన్సీ లైసెన్స్ రద్దుచేసి నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం వినియోగదారులు.

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని గ్యాస్ వాహనం ను పట్టుకొని తూకం వేసారు స్ధానికులు.  ఒక్క సిలిండర్ గ్యాస్ బుడ్డి నుంచి 3 నుండి నాలుగు కిలోలు తక్కువ రావడంతో గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేసారు. దస్తురాబాద్ పోలీస్ స్టేషన్ కి గ్యాస్ వాహనాన్ని తరలించారు. గ్రామస్తుల సమక్షంలో జిల్లా తూనికలు కొలతల అధికారి భూ లక్ష్మి విచారణ చేపట్టారు. మొత్తం 40 సిలిండర్ల లో ఒక్కో సిలిండర్ లో మూడు నుంచి నాలుగు కిలోల బరువు తక్కువగా రావడంతో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news