సీఎం రేవంత్ కి షాక్.. ఎదురు తిరిగిన రైతులు..?

-

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్ లో రైతుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొడంగల్ లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొడంగల్ నియోజకవర్గం లోని దుద్యాల మండలంలోని ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు ఎదురు తిరిగారు. దుద్యాల మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేయనున్న ఫార్మా విలేజ్ కోసం గురువారం భూ సర్వే చేపట్టిన అధికారులను అక్కడి రైతులు అడ్డుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మా భూములను తీసుకుంటే ఇక్కడే చనిపోతామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దుద్యాల ఎమ్మార్వో ఆఫీస్ ముందే పోలేపల్లికి చెందిన మహిళ రైతు తూర్పు రాజమ్మ పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది. ఎట్టి పరిస్థితులలో తన భూమిని ఇవ్వనని.. అవసరమైతే చనిపోవడానికి అయినా సిద్ధమేనని తేల్చి చెప్పింది. మహిళా రైతు పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేయడంతో తోటీ రైతులు అప్రమత్తమై ఆమె చేతిలోని పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు.

అనంతరం భూమి ఇవ్వమని రైతులందరూ కలిసి ఆందోళన చేపట్టారు. దుద్యాల మండలంలోని హకీంపేట్, పోలేపల్లి, లకచర్ల గ్రామాల్లో దాదాపు 3,000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని.. తమకు ఈ ఫ్యాక్టరీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news