తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో రోజుకో సంఘటన వెలుగులోకి వస్తోంది. అయితే.. తాజాగా నల్గొండ గురుకులంలో దారుణం జరిగింది. నల్గొండ గురుకులంలో విద్యార్థులను కరిచాయి ఎలుకలు. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లాలోని రెండు రోజుల కింద దేవరకొండ మండలం కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రాత్రి పడుకున్న విద్యార్థులను ఎలుకలు కరవడంతో 13 మందికి గాయాలయ్యాయని సమచారం అందుతోంది. అయితే… ఉదయం గమనించిన సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.
అయితే రెండు రోజుల కింద ఘటన జరిగిన ఈ విషయం గోప్యంగా ఉంచారట. ఇక ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.