జమ్మూలో ఉగ్రచొరబాటుకు యత్నం.. కాల్పుల్లో టెర్రరిస్టు హతం

-

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చోటుకు యత్నం జరగగా.. అది గ్రహించిన భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ముందుగానే టెర్రరిస్టుల ఆచూకీని కనుగొన్న జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఎన్ కౌంటర్లో ఓ టెర్రరిస్టు మృతి చెందినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పాక్ సరిహద్దు ప్రాంతాల గుండా దేశంలోకి చొరబాట్లు అధికం అవుతున్నాయని ఇంటెలిజెన్స్ ముందుగానే హెచ్చరిచ్చింది.దీంతో నిఘా వర్గాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.

ఈ క్రమంలోనే నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికతో తాంగ్ ధార్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. గత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో టెర్రిరిస్టులను గుర్తించి ఏరివేత ప్రారంభించారు. సుమారు 2 గంటలకు పైగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం.సైన్యం కాల్పుల్లో ఒక టెర్రరిస్టు మరణించగా మిగతా వారు తప్పించుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు కూడా వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news