గుజరాత్‌లో భారీ వర్షాలు.. మొబైల్ సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం

-

గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు పడుతుండటంతో అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. సౌరాష్ట్ర, తీరప్రాంతాల్లోని 12 జిల్లాలను భారీ వరదలు ముంచెత్తాయి. బుధవారం 50-200 మీమీ మేర వర్షాలు కురిశాయి.

 

గురువారం సైతం భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది.రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చాలా ఇళ్లు, అపార్ట్మెంట్లు సైతం నీట మునిగాయి. అయితే, తీరప్రాంత ప్రజలు, సామాన్యులను రక్షించేందుకు 14ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 40వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

అయితే, వర్షాల కారణంగా మొబైల్ సర్వీసుల సేవలు సైతం నిలిచిపోయాయి. పలు చోట్ల టవర్లు,కేబుల్ నెట్వర్కులు ధ్వంసం కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాలని కల్పించింది. దీంతో నెట్వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్వర్క్‌ను వాడుకోవచ్చును. ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్‌లో బెస్ట్ నెట్వర్క్‌కు కనెక్ట్ అవుతుంది.రేపు రాత్రి 12 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news