ఏపీలో భారీ వర్షాలు.. కృష్ణా జిల్లాలో కొట్టుకుపోయిన యువకుడు!

-

ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీ వరదనీరు కొనసాగుతోంది. అంతేకాకుండా పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో వాగులు పొంగి పొర్లుతుండగా రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో రోడ్లు దాటేందుకు సహసం చేయొద్దని ప్రజలకు సూచనలు చేశారు. ప్రవాహం తగ్గాకే రాకపోకలు సాగించాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు వాయవ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news