హైడ్రా కూల్చివేతలు.. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సపోర్టు!

-

తెలంగాణ ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తోంది.ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ మహానగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా కన్నెర్ర చేస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నాయకుల అక్రమ కట్టడాలపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవడంతో పలువురు ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే, రాహుల్ గాంధీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి సపోర్టుగా నిలిచినట్లు కథనాలు వస్తున్నాయి.

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు సోదరుడికి చెందిన ఓఆర్వో స్పోర్ట్స్ కాంప్లెక్స్ హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్‌లో ఉందని హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈ విషయంపై మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు నేరుగా రాహుల్‌కు ఫిర్యాదు చేయడమే కాకుండా తన అసంతృప్తిని సైతం వెల్లగక్కినట్లు తెలిసింది. అయితే, రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్టుగా నిలిచారని, అక్రమ కట్టడాలు ఎవరివి అయినా ముందుకు వెళ్లాలని సూచించినట్లు గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news