ktr on vijaya dairy: తెలంగాణ రాష్ట్రంలో విజయ డైరీ నష్టాల్లో ఉందని వస్తున్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. నిరుటి దాకా లాభాల్లో ఉన్న విజయ డైరీ, వరుసగా ఐదు ఏళ్ళు ప్రభుత్వానికి లాభాల్లో వాటాలు (డివిడెండ్లు) ఇచ్చిన సంస్థ ఒక్కసారిగా నష్టాల బాటలో ఎలా వెళుతోంది? అని ప్రశ్నించారు. నడపలేని అసమర్థతనా? లేక మరేదైనా కారణమా ప్రభుత్వం స్పష్టం చెయ్యాలని ఆగ్రహించారు కేటీఆర్.
లక్షలాది పాడి రైతుల జీవితాలతో ముడి పడి ఉన్న సంస్థ విజయ డైరీ. అలంటి ముఖ్యమైన సంస్థ నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదని మండిపడ్డారు కేటీఆర్. ప్రభుత్వం స్పందించి సంస్థను కాపాడాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు.